పాక్ ఆర్థిక పరిస్థితిపై ఇమ్రాన్ ఖాన్ ఆవేదన..!

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి పై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ …దేశాన్ని ముందుకు నడిపించేందుకు అవసరమైన డబ్బులు ప్రభుత్వం వద్ద లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పారు. అంతే కాకుండా ప్రస్తుతం దేశం ముందు ఉన్న అతిపెద్ద సమస్య ఇదేనని ప్రధాని వెల్లడించారు. ఓ వైపు అప్పులు పెరిగిపోతుండగా మరోవైపు పన్నులు కూడా సకాలంలో వసూలు కావడం లేదని చెప్పారు.

imrankhan
imrankhan

గత ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేయడం వల్లే దేశానికి ఈ దుస్తితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వనరులు తగినంతగా లేకపోవడం వల్లనే ప్రజా సంక్షేమానికి డబ్బులు కేటాయించలేకపోతున్నామని చెప్పారు. నాలుగు నెలల్లో ప్రభుత్వం 3.8 బిలియన్ డాలర్ల అప్పు చేసిందని వాటి నుండి బయటపడాలంటే ప్రజలు పన్నులు చెల్లించాలని చెప్పారు.