సోనియా గాంధీ అధ్యక్షతన నేడు కాంగ్రెస్ కీలక భేటీ… పార్లమెంట్ వ్యూహాలపై చర్చ..

-

ఈనెల 29 నుంచి పార్లమెంట్ శాతాకాల సమావేశాలు ప్రారంభం కానన్నాయి. ఇందుకోసం అధికార పార్టీలో సహా.. ప్రతిపక్షాలన్నీ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రజా సమస్యలపై తమ గళం ఎత్తేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ వ్యూహాలకు పదునుపెట్టింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో బీజేపీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా.. కాంగ్రెస్ ప్రణాళిక రూపొందిస్తుంది.

తాజాగా నేడు సోనియా గాంధీ అధ్యక్షతన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం కానుంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. చర్చించాల్సిన అంశాలపై చర్చ జరుగనుంది. పార్లమెంట్ స్ట్రాటజిక్ గ్రూప్ సభ్యుల భేటిలో పార్లమెంట్ లో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలను గురించి ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయాలు.. పెట్రోల్ రేట్లు, రైతు చట్టాలు, ద్రవ్యోల్బనం, నిరుద్యోగం వంటి అంశాలపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news