9 ఏండ్లల్లో కనురెప్ప కొట్టేంత సేపైనా కరెంటు పోయిందా? : కేసిఆర్

-

సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూర్చుంటే లేవ చాత కాదు కానీ.. తాటి చెట్టు అంత ఎగురుతా అన్నాడంట అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు మెదక్ ,జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… డిసెంబర్ 9 తారీకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తా అన్నడు, డిసెంబర్ 9 పోయింది.. మళ్లీ ఆగస్ట్ 15 కు వేస్తాం అంటుండు అని మండిపడ్డారు.

సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టినందుకు సల్వాజీ మాధవరావు అనే ఉద్యమకారుడిని అక్రమ కేసులు జైల్లో పెట్టించారు అని తెలంగాణ పోలీసులకు కేసిఆర్ వార్నింగ్ ఇచ్చారు.ఎక్కడికి పోయింది మన కరెంటు? 9 ఏండ్లల్లో కనురెప్ప కొట్టేంత సేపైనా కరెంటు పోయిందా? అని ప్రశ్నించారు.కరెంటు పోకుండా ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి కేసీఆర్ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news