తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు గోస తప్ప భరోసా ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై సోమవారం ఆయన ఎక్స్ వేదికగా మరోసారి ట్వీట్ చేశారు. ‘నిన్న వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు. నేడు యాసంగి పెట్టుబడి సాయానికి పాతరేస్తారట?
దగా పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? కాంగ్రెస్ పాలనలో..ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకొకటి ఉంటదా ? రేవంత్ ఏడాది ఏలికలో…తెలంగాణ రైతుకు గోస తప్ప.. భరోసా లేనే లేదు? వానాకాలం పెట్టుబడి సాయానికి మోక్షం లేదు. యాసంగి రైతుభరోసాకు దారే కనిపించడం లేదు.
2 లక్షల రుణమాఫీ పేరిట దగాచేశారు.. ఇక రైతుబంధును కూడా ఎత్తేస్తారా??ఇలాగైతే తెలంగాణలో సాగు సాగేదెలా..?ఏడాదిలోనే బక్కచిక్కిన రైతు బతికేదెలా..??సిగ్గు లేని కాంగ్రెస్ పార్టీ.. చేతకాని హామీలు ఇవ్వడమెందుకు ?అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం ఎందుకు ?? అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతను ఆగం చేశారు. సంతోషంగా సాగిన వ్యవసాయాన్ని సంక్షోభంగా మార్చారు. మరోసారి ఎవరేంటో తేలిపోయింది..
బీఆర్ఎస్ నినాదం.. విధానం.. జై కిసాన్. కాంగ్రెస్ పాలసీ ఎప్పటికీ.. నై కిసానే.. జై తెలంగాణ’ అని రాసుకొచ్చారు.