ప్రైవేట్ బ్యాంకు అయిన డెవలప్‌మెంట్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డిబిఐఎల్) తో లక్ష్మి విలాస్ బ్యాంక్ విలీన ప్రక్రియకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లక్ష్మి విలాస్ బ్యాంక్ పై 30 రోజుల తాత్కాలిక నిషేధాన్ని కేంద్రం విధించిన వారం రోజుల తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. విత్ డ్రాను రూ .25 వేలకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బుధవారం మాట్లాడుతూ కీలక విషయం వెల్లడించారు.
ఈ నిర్ణయం తో డిపాజిట్ చేసిన వారి విత్ డ్రా కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవు అని స్పష్టం చేసారు. బ్యాంకుల విషయంలో సమర్ధవంతంగా పని చేయని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంకు ని కేంద్రం కోరినట్టు చెప్పారు. ప్రైవేటు రంగ బ్యాంకు ఆర్థిక పరిస్థితి క్షీణించిన దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ సలహా మేరకు ఈ చర్య తీసుకున్నారు. యస్ బ్యాంక్ తరువాత లక్ష్మి విలాస్ బ్యాంక్ పతనం అంచున నిలబడింది.