బ్రేకింగ్: కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 91 లక్షలు దాటిన సంగతి తెల్సిందే. ఈ నేపధ్యంలో నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్తలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. శీతాకాలం ప్రారంభమైన తరువాత అనేక రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో (యుటి) కోవిడ్ -19 కేసుల పెరుగుదల నేపధ్యంలో డిసెంబర్ 1 నుండి అమలులోకి వచ్చే మార్గదర్శకాలు విడుదల చేసారు. వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు మరియు యుటిలు స్థానిక ఆంక్షలను విధించవచ్చని హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

కంటెమెంట్ జోన్ల నేపధ్యంలో… అవసరమైన కార్యకలాపాలను మాత్రమే మంత్రిత్వ శాఖ అనుమతించింది. అత్యవసర వస్తు సేవలను మాత్రమే అందించాలని పేర్కొంది. కొన్ని కార్యకలాపాలు మాత్రం కింది పరిమితులతో మాత్రమే అనుమతించారు.

1. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) అనుమతి మేరకు ప్రయాణికుల అంతర్జాతీయ విమాన ప్రయాణం ఉంటుంది అని కేంద్రం చెప్పింది.

2. సినిమా హాళ్లు, థియేటర్లు, 50 శాతం వరకు సామర్థ్యంతో నడుపుకోవచ్చు అని కేంద్రం చెప్పింది.

3. స్విమ్మింగ్ ఫూల్స్, అథ్లెట్లకు శిక్షణ కోసం మాత్రమే ఓపెన్ చేయాలని చెప్పింది.

4. ఎగ్జిబిషన్ హాల్స్, బిజినెస్ టు బిజినెస్ (బి 2 బి) ప్రయోజనాల కోసం మాత్రమే అని పేర్కొంది.

5. హాల్ సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం వరకు సామాజిక, మత, క్రీడలు, వినోదం, విద్యా, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు నిర్వహించవచ్చు అని చెప్పింది.

రాష్ట్రాలు మరియు యుటిలు కరోనాను కట్టడి చేయడానికి మాస్క్ లు, సామాజిక దూరం వంటివి కొన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రం వెల్లడించింది. ఒకవేళ అవి ఎవరు అయినా పాటించలేదు అంటే మాత్రం వారికి జరిమానా విధించాలి అని కేంద్రం స్పష్టం చేసింది.

రద్దీగా ఉండే ప్రదేశాలలో – ఎక్కువగా మార్కెట్లు, ప్రజా రవాణా మరియు వీకెండ్ బజార్లలో సామాజిక దూరాన్ని గమనించడం కోసం – కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ (SOP) ను జారీ చేస్తుంది. దీనిని అన్ని రాష్ట్రాలు మరియు యుటిలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news