చిన్న పిల్లల పేరుతో రూ. 2లక్షల పిక్స్ డ్ డిపాడిజిట్ చేస్తాం : సీఎం చంద్రబాబు

-

చిన్న పిల్లల పేరుతో  రూ.2 లక్షలు ఫిక్స్ డ్  డిపాడిజిట్ చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా జీడీ నెల్లూరు ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకొన్నాను. గత ఐదేళ్లలో లేని సంతోషం ప్రజల్లో కనపడుతోంది. నెలకు 8 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. తలసేమియా, డయాలసిస్ రోగులకు నెలకు 10 వేలు ఇస్తున్నామని తెలిపారు.

నెలకు రూ.2800 కోట్లు, ఏడాదికి 33 వేల కోట్లు ఇస్తున్నామన్నారు.  జీడీ నెల్లూరు లో తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిన ఇద్దరు ఆడ పిల్లలను ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల అమ్మమ్మ కు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. త్వరలో ఇంటింటికి ఇంటర్ నెట్ తీసుకొస్తామన్నారు. అలాగే తాను గతంలో  డ్వాక్రా మహిళల గురించి చెప్పినప్పుడు, సెల్ ఫోన్ గురించి వివరించినప్పుడు అందరూ నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ విలువ తెలుస్తుంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version