విశాఖలో ఇప్పుడు భయంకరంగా పరిస్థితి ఉందని అధికారులుచెప్తున్నారు. ఎల్జీ పాలీమర్స్ కంపెనీలో జరిగిన గ్యాస్ ప్రమాదంతో అక్కడ జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఊపిరి ఆడక మూగ జీవాలు కూడా మరనిస్తున్నాయి. కుక్కలు, పావురాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 5 మంది దీని కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇక అక్కడి స్థానికులతో మీడియా మాట్లాడగా… ఎంత మరణించారో తెలియదు అని, చాలా మంది బయటకు రావడానికి భయపడి ఇళ్ళల్లో ఉండి తలుపులు వేసుకున్నారని చెప్తున్నారు. ఎంత మంది మరణించే అవకాశం ఉంది అనేది చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2 వేల మంది వరకు ఆశ్వస్తతకు గురయ్యారని, వారు అందరిని ఇప్పుడు స్థానిక ఆస్పత్రుల్లో తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. పరిస్థితిని తాము ఇప్పుడు చెప్పలేమని అంటున్నారు. కొంత మంది గిల గిలా కొట్టుకుని మరణించారు అని వార్తలు వస్తున్నాయి. దీనిపై పరిస్థితి ఏంటీ అనేది మరో రెండు మూడు గంటల్లో అంచనాకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వృద్దులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్తున్నారు.