ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ రేట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపాయి సెస్ విధించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెస్ విధించడం ద్వారా 500 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని రోడ్ల నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఈ అదనపు ఆదాయాన్ని బదిలీ చేస్తున్నట్టుగా రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు.ఇప్పటికే కరోనా దెబ్బకు రోడ్డున పడిన వాహనదారులు ఈ నిర్ణయం తో మరింత ఇబ్బంది పడే అవకాశం ఉందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.