నాపై చెయ్యి పడితే.. జరిగేది అదే.. రఘురామ ఘాటు వ్యాఖ్యలు..!

-

గత కొన్ని రోజుల నుంచి వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఎంపీలు అందరూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఎంపీలు చేసిన వ్యాఖ్యల పై స్పందించిన రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో వారికి కౌంటర్ ఇచ్చారు. ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థాయిలో తాను లేనని తెలిపిన రఘు రామ… తన ఒంటి పై చేయి పడితే కాపాడేందుకు హేమాహేమీలున్నారు అంటూ హెచ్చరించారు.

raghu

న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించేందుకే పార్టీ పని చేస్తుందని… అందుకే ప్రశ్నించిన నన్ను పార్టీ నుంచి బహిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అంటూ విరుచుకుపడ్డారు. ప్రజలు ఉమ్మేసేలా మాట్లాడటం తనకు చేత కాదు అంటూ తెలిపిన రఘు రామ… నన్ను కంటికి రెప్పలా కాపాడుకొనే వాళ్లు అన్ని రాష్ట్రాలలో తనకు స్నేహితులు ఉన్నారు అంటూ హెచ్చరించారు.. కరోనా తగ్గిన తర్వాత చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news