రేషన్ కోటా పెంచండి.. కేంద్రానికి సీఎం కీలక విజ్ఞప్తి

-

కొత్త రేషన్ కార్డుల జారీ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన కోటా పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు కొనసాగిన చర్చల్లో2014-15 కి గాను సేకరించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యం బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయడంతోపాటు సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కోరారు. అయితే ఈ సమావేశం పూర్తి స్థాయిలో జరుగలేదు. ప్రహ్లద్ జోషికి మరో అపాయింట్ మెంట్ ఉండటంతో ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు మరోసారి కేంద్ర మంత్రితో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరుగలేదు. ఈ క్రమంలోనే కార్డుల జారీకి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఎన్నికల కోడ్ ముగియనుండటంతో దీనిపై ముందడుగు వేయాలని భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version