తెలంగాణలో పెరిగిన భూముల విలువ.. ఎల్లుండి నుంచి అమల్లోకి

తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరగనున్నాయి. భూముల విలువ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కాసేపటి క్రితమే ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్వర్వుల ప్రకారం… ఎల్లుండి నుంచి భూముల కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.

telangana-logo

తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయంతో….సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు జనాలు పోటెత్తుతున్నారు. కాగా… ఇటీవలె జరిగిన తెలంగాణ కేబినేట్‌ సమావేశంలో భూముల ధరలు పెంచాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్‌.  దీంతో  తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల విలువ ప్రాంతాల వారీగా పెరగనున్నాయి. అలాగే వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు మార్కెట్‌ విలువుల కూడా పెరగనున్నాయి. ఇది ఇలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశాలు స్పష్టం కనిపిస్తుంది.