తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ రోజు సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ కేబినెట్ లో సీఎం కేసీఆర్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియాలో వయో పరిమితి గురించి గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. వయో పరిమితిని పెంచాలని పలువురు నిరుద్యోగులు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
దీంతో తాజా గా సీఎం కేసీఆర్ పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియాలో ప్రస్తుతం ఉన్న దాని కంటే.. మూడేళ్ల ను పెంచారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 వేల మంది నిరుద్యోగులకు.. సీఎం కేసీఆర్ నిర్ణయంతో లాభం చేకురే అవకాశం ఉంది.
కాగ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయక చాలా రోజులు అవుతుంది. దీంతో నిరుద్యోగులకు వయసు మీద పడింది. వీరికి ఉపయోగపడేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీలో ఉండే ఇంటర్వ్యూ పద్దతిని కూడా సీఎం కేసీఆర్ ఎత్తివేశారు.