ఆరోగ్యానికి ములేతి ఎంతో బాగా మేలు చేస్తుంది. దీని వల్ల చాలా సమస్యలను తొలగించుకో వచ్చు. ఆయుర్వేద వైద్యంలో కూడా ములేతిని వాడుతూ ఉంటారు. దీని వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి. అయితే మరి ములేతి వల్ల కలిగే లాభాలు ఏమిటి..?, ఎటువంటి సమస్యలు దూరమవుతాయి అనే దాని గురించి చూద్దాం. ములేతి వలన ఎన్నో సమస్యలకి మనం చెక్ పెట్టచ్చు. అయితే మరి ఎలాంటి సమస్యలు వుండవు అనేది చూద్దాం.
జీర్ణ సమస్యలు ఉండవు:
ములేతి లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇంఫ్లమేషన్ ను ఇది తొలగిస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ వంటి సమస్యలను తొలగించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. స్టమక్ అల్సర్, గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లెక్స్, ఫుడ్ పాయిజనింగ్, అజీర్తి, గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇందులో యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది. అలానే ఇన్ఫెక్షన్స్ ని కూడా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
హార్మోన్స్ ని రెగ్యులేట్ చేస్తుంది:
మూడ్ స్వింగ్స్, మెనోపాజ్ యొక్క లక్షణాలు మొదలైనప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. డెలివరీ తర్వాత తల్లులు ములేతిని తీసుకోవడం వల్ల పాలు బాగా పడతాయి అలానే చర్మ సమస్యలు, లివర్ సమస్యలు కూడా ఉండవు. డార్క్ స్పాట్స్ ను తగ్గించడానికి, కడుపు దగ్గర కొవ్వు కరిగించడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది ఇలా ఎన్నో లాభాలను మనం దీనివల్ల పొందొచ్చు.