మొహాలీలో జరుగుతున్న మొదటి వన్ డే లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఓవర్ లలో 276 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మొదటి పది ఓవర్ లలో మినహా ఎక్కడా సక్రమంగా జరగలేదు. మొదటి ఓవర్ లోనే మిచెల్ మార్ష్ వికెట్ తీసి షమీ ఇండియాకు శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత రెండవ వికెట్ కు వార్నర్ మరియు స్మిత్ లు 94 పరుగులు జోడించారు. ఆ తర్వాత వార్నర్ (52) అవుట్ అవడమే తరువాయి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చాలా నెమ్మదించింది. వెంటనే స్మిత్ (41) మరియు ఆ తర్వాత లాబుచెన్ (39) వికెట్లు కోల్పోయింది. ఇంగ్లీష్ (45) మరియు గ్రీన్ (31) లు కాసేపు ప్రతిఘటించినా పరుగులు వేగంగా చేయడంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఆఖర్లో స్టాయినిస్ (29) కమిన్స్ (21) బ్యాట్ జులిపించడంతో ఆస్ట్రేలియా స్కోర్ ఆ మాత్రం అయినా చేసింది. ఇక ఇండియా బౌలర్లలో షమీ అయిదు వికెట్లతో ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు.
ఇతనికి బుమ్రా, జడేజా అశ్విన్ ల నుండి చక్కని సహకారం లభించింది. మరి ఇండియా ముందు ఉంచిన 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందా చూడాలి.