IND VS ENG : ఐదో టెస్టుకు రీఎంట్రీ ఇవ్వనున్న స్టార్‌ పేసర్‌

-

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండియా – ఇంగ్లండ్‌ మధ్య చివరి టెస్టు.. మార్చి 07 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది.ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.ఇంకా సిరీస్ లో ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడా తో సిరీస్ ని సొంతము చేసుకున్న భారత టీమిండియా కు శుభవార్త. నాల్గో టెస్టుకు దూరమైన టీమిండియా పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా.. ధర్మశాలలో ఆడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.ఈ మేరకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు జస్ప్రిత్‌ బుమ్రా ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. వర్క్ లోడ్ ఎక్కువ కావడంతో నాలుగో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

ఇక నాలుగో టెస్ట్ లో గెలిచిన టీమిండియా ఐదో టెస్టులో ప్రయోగాలు చేసే అవకాశమున్నదని, సీనియర్‌ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చి కొత్త ప్లేయర్స్ కి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.ఒకవేళ బుమ్రా ఐదో టెస్ట్ ఆడితే సిరాజ్‌కు రెస్ట్‌ ఇవ్వొచ్చు. ధర్మశాల పిచ్‌ పేసర్లకు అనుకూలంగా అవకాశం ఉండడంతో స్పిన్‌ ఎటాక్‌ కంటే పేసర్లతో ఇంగ్లండ్‌కు కట్టడి చేయాలని ఇండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే ఐదో టెస్టులో బుమ్రాను ఆడించనున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version