ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నారు.వరుస డబుల్ సెంచరీలతో అదరగొట్టిన యువ సంచలనం జైస్వాల్ మరో రికార్డ్ కి చేరువలో ఉన్నాడు. ఫస్ట్ టెస్ట్లో అర్ధ సెంచరీ చేసిన ఇతడు.. సెకండ్ & థర్డ్ టెస్టులో డబుల్ సెంచరీలతో చెలరేగారు. తాజాగా 4వ టెస్టులో ఇప్పటికే అర్ధ సెంచరీ బాదారు. ఇదే ఊపులో ఇంగ్లండ్ పై ఓ టెస్టు సిరీస్లో అత్యధికముగా 600లకు పైగా రన్స్ చేసిన 2 వ ఇండియా ఆటగాడిగా నిలిచాడు.కోహ్లి 655 రన్స్తో నంబర్ 1 స్థానంలో ఉన్నారు.
గతేడాది వెస్టిండీస్ పర్యటనతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్….కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లోనే 618 రన్స్ (తొలి టెస్టులో 80, 15; రెండో టెస్టులో 209, 17; మూడో టెస్టులో 10, 214; నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 73) చేశాడు.ఇక, టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఆస్ట్రేలియా దిగ్గజం డొనాల్డ్ బ్రాడ్‌మన్ 1930లో ఒక సిరీస్‌లో ఐదు టెస్టుల్లో అతడు ఏకంగా 974 రన్స్ చేశాడు.