కేఫ్ టౌన్ వేదికగా జనవరి 3న ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య చివరి టెస్టు జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. తొలి మ్యాచ్లో టీమిండియా పై ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో సౌత్ఆఫ్రికా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే చివరి టెస్టులో ఎలాగైనా గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇదిలా ఉంటే… కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ లో జరిగిన ఒక్క టెస్ట్ మ్యాచ్లో కూడా భారత్ జట్టు విజయం సాధించలేకపోయింది.
ఇప్పటివరకు కెప్టెన్ వేదికగా టీమిండియా సౌత్ ఆఫ్రికా తో ఆరు మ్యాచ్లలో తలపడింది ఇందులో టీమిండియా నాలుగు మ్యాచ్లలో ఓటమి పాలయింది. కాగా మిగతా రెండు మ్యాచ్లు డ్రా గా ముగిశాయి. ఇండియన్ టీం లో కోహ్లీ ,రోహిత్ శర్మ ,కేఎల్ రాహుల్ మొదలైన కీలక ఆటగాళ్లు ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా ను ఓడించడం అంత సులువు కాదు. గత టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించినప్పటికీ రెండవ ఇన్నింగ్స్ లో కేవలం నాలుగు పరుగులకే అవుట్ అయ్యారు. చివరిసారిగా 2022లో కెప్టెన్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా పరాజయం పాలయింది.