అలా చేసుంటే సలార్ కు ఇంకా కలెక్షన్లు ఎక్కువొచ్చేవి : బాహుబలి ప్రొడ్యూసర్

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా కేజీయఫ్ ఫేం ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’ . శ్రుతిహాసన్‌ కథానాయికగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్లో కూడా చేరినట్టు సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వసూళ్ల వర్షం కురిపిస్తున్న సలార్ మూవీపై బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

SalaarReleaseTrailer

తాజాగా ఓ వెబ్‌సైట్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న శోభు యార్లగడ్డ ‘సలార్‌’ హిందీ కలెక్షన్స్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు ప్రమోషన్స్ చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో ‘సలార్‌’ చిత్రానికి ప్రమోషన్స్‌ అవసరం లేదని.. ఎందుకంటే, ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ గురించి ఇక్కడ అందరికీ తెలుసని శోభు చెప్పారు. వాళ్లిద్దరి సినిమా కోసం సౌత్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని అన్నారు.

అయితే హిందీ మార్కెట్‌కు వెళ్లేసరికి షారుక్‌ ఖాన్‌ నటించిన ‘డంకీ’ పోటీగా ఉన్నప్పుడు.. మన చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం ప్రమోషన్స్‌ తప్పనిసరిగా చేయాలని తెలిపారు. నార్త్‌లో ప్రమోషన్స్‌ చేసి ఉంటే ఆ మార్కెట్‌ నుంచి ఇంకాస్త ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చేవని శోభు వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news