IND vs SL : రాణించిన లంక బ్యాట‌ర్లు.. ఇండియా టార్గెట్ 184

-

ధ‌ర్మ‌శాల వేదికగా శ్రీ‌లంక, భార‌త్ మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్ జ‌రుగుతున్న విషయం తెలిసిందే. కాగ ఈ మ్యాచ్ లో రోహిత్ సేన టాస్ నెగ్గి.. శ్రీ‌లంక‌కు మొద‌ట బ్యాటింగ్ చేయ‌డానికి ఆహ్వ‌నించింది. దీంతో శ్రీ‌లంక ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెన‌ర్లు పాతుమ్ నిస్సాంక (75), ద‌నుష గుణ‌తిల‌క (38) మెరుపు బ్యాటింగ్ చేశారు. దీంతో మొద‌టి వికెట్ కు 67 ప‌రుగుల భాగ‌స్వామ్యంలో నొల‌కొంది. వీరి త‌ర్వాత టాప్ ఆర్డార్ కుప్పు కూలినా.. కెప్టెన్ దసున్ షనక విధ్వంసం సృష్టించాడు.

కేవ‌లం 19 బంతుల్లోనే 47 ప‌రుగులు చేశాడు. వీటిలో 5 సిక్సులు, 2 ఫోర్లు బాదాడు. కెప్టెన్ ద‌సున్ దాటికి చివ‌రి 5 ఓవ‌ర్ల‌లో ఏకంగా 16 ర‌న్ రేటుతో 80 ప‌రుగులు వ‌చ్చాయి. అలాగే భార‌త బౌల‌ర్లు, భూవ‌నేశ్వ‌ర్, బూమ్రా, హ‌ర్షల్ ప‌టేల్, చాహాల్, జ‌డేజా ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. దీంతో శ్రీ‌లంక నిర్ణ‌త 20 ఓవ‌ర్లో 5 వికెట్లు కొల్పోయి.. 183 ప‌రుగులు చేసింది. కాగ ఈ మ్యాచ్ లో భార‌త్ గెల‌వాలంటే.. 184 ప‌రుగులు చేయాల్సి ఉంది. భార‌త ఓపెనర్లు.., రోహిత్ శ‌ర్మ‌, ఇషన్ కిషన్ దాటిగా ఆడితే.. విజ‌యం భార‌త్ దే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news