ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్ధలకు స్వాగతం పలికిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

-

ఉక్రెయిన్- రష్యా సంక్షోభం మధ్య ఉక్రెయిన్ దేశంలో చిక్కకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలిస్తున్నారు. తాజాగా రోమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి తొలి విమానం ముంబై విమానాశ్రమానికి చేరుకున్నారు. మధ్యాహ్నం బుచారెస్ట్ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం తొలిబ్యాచ్ విద్యార్థులతో ముంబై చేరింది. 219 మంది విద్యార్థులతో ముంబై చేరుకుంది. 

ముంబై చేరుకున్న విద్యార్థులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆహ్వానం పలికారు. రెండో బ్యాచ్ విమానం ఢిల్లీకి చేరుకుంటుందని… భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చే దాకా మిషన్ కొనసాగిస్తూనే ఉంటామని పియూష్ గోయల్ అన్నారు. అంతకు ముందు మన పౌరుల భద్రతకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని ట్విట్ చేశారు పీయూష్ గోయల్. ముంబై చేరుకున్న విద్యార్జులో విమానంలోనే పియూష్ గోయల్ మాట్లాడారు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… ప్రధాని మోదీ ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వాలతో మాట్లాడారని.. త్వరలోనే మిగతా విద్యార్థులను కూడా తీసుకువస్తాం అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news