IND-W vs BAN-W: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. ఫైనల్స్ కు చేరిన టీమిండియా.

-

మహిళల ఆసియా కప్ సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ పై ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.శ్రీలంకలోని డంబుల్లా స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన సెమీస్‌-1లో 81 రన్స్ టార్గెట్ ని 11 ఓవర్లలోనే ఈజీగా ఛేదించింది. భారతం బ్యాటర్లలో స్మృతి మంధాన 55 పరుగులు ,షఫాలీ వర్మ 26 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ గెలుపుతో టీమ్ ఇండియా ఫైనల్లో అడుగుపెట్టింది. తాజా విజయంతో ఆసియా కప్ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు (9 సార్లు) ఫైనల్ చేరిన జట్టుగా రికార్డ్ సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ చేసిన బంగ్లా టీమిండియా బౌలర్ల ధాటికి విలవిలలాడింది.నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 80 రన్స్ మాత్రమే చేసింది. బంగ్లాదేశ బ్యాటర్లలో కెప్టెన్ నిగర్ సుల్తానా 32 రన్స్ , షోర్నా అక్తర్ (19) చేశారు. టీమిండియా బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు మిగిలిన బ్యాటర్లు అంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే వెనుతిరిగారు. భారత్ బౌలర్లలో రాధా యాదవ్,రేణుకా సింగ్ చెరో 3 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించగా.. పూజా వస్త్రాకర్ ,దీప్తి శర్మ చెరో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news