wtc ఫైనల్ : తక్కువ పరుగులకే కుప్పకూలిన ఇండియా ఆలౌట్

-

wtc ఫైనల్ లో టీం ఇండియా తడపడింది. తొలి ఇన్నింగ్స్ లో అతి తక్కువ పరుగులకే ఇండియా ఆలౌట్ అయింది. కేవలం 217 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే.. రహానే 49 పరుగులు, కోహ్లీ 44 పరుగులు చేసి టీం ఇండియా జట్టును ఆదుకున్నారు. అలాగే రోహిత్ (34) శుభమన్ గిల్ (28) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అటు టీం ఇండియా మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఇక న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ లో దుమ్ములేపింది.

న్యూజిలాండ్ బౌలర్ జేమీసన్ అద్భుత బౌలింగ్ తో టీమిండియా నడ్డి విరిచాడు. జేమీసన్ ఏకంగా 5 వికెట్లు తీసి టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. న్యూజిలాండ్ బౌలింగ్ వివరాలలోకి వెళ్తే ట్రెంట్ బోల్ట్, వాగ్నర్ చెరో రెండు వికెట్లు తీయగా.. సౌదీకి ఒక వికెట్ పడింది. కాగా ఇండియా మరియు న్యూ జిలాండ్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కు వరుణుడు గండంగా మారిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news