ఇండియాలో భారీగా తగ్గిన కరోనా… కొత్తగా 31,222 కేసులు

మన దేశంలో ఇవాళ కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. నిన్నటి రోజున 38 వేల కు పైగా కరోనా కేసులు నమోదు కాగా… గడిచిన 24 గంటల్లో దేశంలో 31,222 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,58,843 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,92,864 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.51 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 290 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,41,042 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 42, 942 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,22,24,937 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 69,90,62,776 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇది ఇలా ఉంటే భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్త నడకన సాగుతోంది.