తెలంగాణలో భారీ వర్షాలు… ట్రోల్‌ ఫ్రీ నంబర్ల ఏర్పాటు

తెలంగాణలో చాలా జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న టి రోజున కురిసిన వర్షాలతో అన్ని జిల్లాల్లో అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ కుండపోత వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిసాయి. అత్యధికంగా హనుమకొండ జిల్లా నడికుడ మండలంలో 38 సెం.మీ వర్షపాతం నమోదు కాగా… ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో రెడ్ అలర్ట్ & ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ.

ఇక జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతి నిధులు, పోలీస్ ఉన్నతాధికారులను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టాలని… ప్రజలను అప్రమత్తంచేసి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు సూచనలు చేశారు. వాగులు,చెరువులు, కుంటల వద్ద జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక వరంగల్ & హనుమకొండ కలెక్టరేట్ లలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసారు అధికారులు. వరంగల్ 915452937, 1800 425 3424 టోల్ ఫ్రీ నెంబర్లు కాగా… హనుమకొండ లో 1800 425 1115 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు అధికారులు.