చంపినోడే ధైర్యంగా చెబుతున్నాడు… చచ్చినోడు సైలంట్ గా ఉన్నాడు!

-

దొంగదెబ్బతీసేవాడికి నిత్యమూ భయమే.. అధైర్యంతో కాపురం చేయాల్సిన పరిస్థితి వాడిది.. పొరపాటున వాడు చచ్చినా అయినవాళ్లు గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి! ఈ పరిస్థితిని భారత్ పై దొంగదెబ్బ తీసే సమయంలో… పాకిస్థాన్ – చైనాలు నిత్యం ఎదుర్కొంటుంటాయ్యి. ఈ క్రమంలో గతంలో కూడా పాకిస్థాన్ నుంచి వారి అధికారిక, అనధికారిక సైన్యం (ఉగ్రవాదులు) పీఓకే వద్ద భారత సైన్యంపై దాడి చేసినప్పుడు.. మనసైన్యం ప్రతిస్పందించినప్పుడు… మనం ఒక్క ప్రాణాన్ని కోల్పోయినా ధైర్యంగా ప్రకటించుకుంటాం… గర్వంగా నివాళులు అర్పిస్తాం. కానీ… పాకిస్థాన్ – చైనాలకు ఆ ధైర్యం లేదు! దొంగ చావుకి – వీరమరణానికి తేడా వారికి తెలిసినందువల్లేమో!

తాజాగా పాకిస్థాన్ చేసిన పనినే చైనా కూడా చేస్తుంది! గాల్వాన్ లోయలో భారత్ – చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైనికులు 20మంది వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో చైనాకు కూడా భారీగా ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే చైనాకు జరిగిన ప్రాణ నష్టం ఎంత? భారత సైన్యం చేతిలో చచ్చిన చైనా సైన్యం ఎంతమంది? అనే విషయాలపై చైనా ఇప్పటివరకూ నోరు మెదపలేదు! వారు నిజంగా దేశభక్తులు అని చైనా నమ్మితే.. వారి మరణాన్ని వీరమరణంగా ప్రకటించుకోవచ్చు కాని.. దొంగచావులుగా దాచిపెడుతుంటుంది.

ఈ విషయాలపై తాజాగా కేంద్ర మంత్రి, మాజీ సైన్యాధికారి జనరల్ వీకే సింగ్ స్పందించారు. మరణించిన సైనికుల లెక్కలు చెప్పడంలో చైనా మొదటినుంచీ ఇంతేనని, వారికి ఆ ధైర్యం లేదని ప్రకటించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కు చెందిన 40మందికి పైగా సైనికులను చైనా కోల్పోయిందని వీకే సింగ్ తెలిపారు. 1962 భారత్ – చైనా యుద్ధంలో కూడా తమ సైనికులు ఎంత మంది చనిపోయారనే విషయం చైనా దాచిపెట్టిందని వీకే సింగ్ విమర్శించారు. అది వారి పరిస్థితి..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version