75 లక్షల మార్క్‌ ని క్రాస్ చేసిన కరోనా కేసులు

-

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మధ్యలో కొన్ని రోజుల పాటు కేసులు మరణాలు రెండూ తక్కువ నమోదు కావడంతో ఇక కరోనా ఎఫెక్ట్ తగ్గినట్టేనని భావించారు. కానీ ఇప్పుడు నెమ్మదిగా కేసులు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా నమోదయిన కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75 లక్షల 50 వేలు దాటింది. గడచిన 24 గంటలలో 55,722 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 579 మంది మృతి చెందారు.

Coronavirus on scientific background

అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 66,399గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,50,273 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 7,72,055 ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 66,63,608కి చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,14,610కి చేరింది. ఇక దేశంలో నిన్న 8,59,786 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటిదాకా 9,50,83,976 పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news