ఇండియా వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడచిన 24 గంటలలో రికార్డ్ స్థాయిలో 96,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,209 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 70,880 కాగా దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45,62,415కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 9,43,480 గా ఉండగా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 35,42,663కు చేరింది.
కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 76,271కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 77.65 శాతం ఉండగా, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 20.68 శాతంగా ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కరోనా కేసులలో 1.67 శాతానికి మరణాల రేటు తగ్గింది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 11,63,542 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా దేశంలో ఇప్పటివరకు 5,40,97,975 “కరోనా” వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్టాయింది.