కరోనా కేసుల్లో ఇండియా కొత్త రికార్డ్..

-

భారత్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజూ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 64 వేల మందికి పైగా గత 24 గంటల్లో కరోనా బారిన పడ్డారు. 64,399 కరోనా కేసులు నమోదు కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఇరవై ఒకటిన్నర లక్షలు దాటాయి. ఇప్పటిదాకా ఇంత భారీగా కేసులు నమోదు కావడం ఇదే మొదలు.

corona-positive
corona-positive

రెండ్రోజుల క్రితం అరవై రెండు వేల కేసులు నమోదయినా నిన్న కాస్త తగ్గాయి, మళ్ళీ ఈరోజు భారీగా పెరిగిపోయాయి. దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య చూస్తే 21,53,011కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో 861 మంది చనిపోగా ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 43,379కు చేరింది. ఇక దేశంలో 6,28,747 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలానే ఇప్పటి వరకు కరోనా నుంచి 14,80,885 మంది కోలుకుని బయటపడ్డారు. దేశ వ్యాప్తంగా కరోనా పరిక్షలు రెండు కోట్లు దాటాయి. దేశంలో ఇప్పటి వరకు 2 కోట్ల 2 లక్షల పరిక్షలు చేసామని కేంద్రం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news