దేశంలో అంతకంతకు పెరుగుతున్న కరోన కేసులు…

-

భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డుస్థాయిలో 70 వేల 589 పాటిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 61 లక్షల 45 వేలకు చేరింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా 776 మంది చనిపోగా…84 వేల 877 మంది వైరస్ నుంచి కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో కరోనాతో 96 వేల 318 మంది చనిపోగా…కోలుకున్నవారి సంఖ్య 51 లక్షల వెయ్యి 397కు పెరిగింది.

దేశ వ్యాప్తంగా 9 లక్షల 47 వేల 576 యాక్టివ్ కేసులున్నాయని బులిటెన్ లో తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. రోగుల రికవరీ రేటు 83.01 గా నమోదైందని ప్రకటించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 15.42 గా ఉండగా…ఇప్పటి వరకు 7 కోట్ల 31 లక్షల 10 వేల 41 టెస్టులు చేసినట్టు బులిటెన్ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version