భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 71 లక్షల 20 వేలు దాటింది. గడచిన 24 గంటలలో 66,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 816 మంది మృతి చెందారు. అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 71,559గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 71,20,539 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 8,61,853 ఉన్నాయి.
ఇప్పటిదాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 61,49,536కి చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,09,150కి చేరింది. ఇక దేశంలో 86.36 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 12.10 శాతంగా ఉంది. అలానే దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.53 శాతానికి మరణాల రేటు తగ్గింది. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 9,94,851 కాగా ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 8,78,72,093కు చేరింది.