నేడు ఇండో–చైనా 7వ దశ కమాండర్ లెవల్ చర్చలు..గట్టి కౌంటర్‌ ఇవ్వనున్న భారత్‌

-

ఈ రోజు మధ్యహ్నం భారత్‌ చైనా సరిహద్దుపై వివాదంపై రెండు దేశాల ఆర్మీ ఆధికారులు మరోసారి చర్చలు జరపనున్నారు..గల్వాన్‌ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి..దీంతో గత కొద్దీ రోజులగా రెండు దేశాల ఆర్మీ ఆధికారులు చర్చలు జరుపుతున్నారు..ఈ రోజు మరోసారి కమాండర్ లెవల్ చర్చలు జపనున్నారు..ఇప్పటికే 6 దశలుగా చర్చలు జరిగినప్పటికి చైనా తన వక్ర బుద్ధిన మార్చుకోవడం లేదు..నిత్యం సరిహద్దులో భారత సైన్యంలో రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూనే ఉంది.

గల్వాన్‌ లోయతోపాటు పాంగాంగ్‌ ట్సో వెంబడి ఉన్న గోగ్రా, ఫింగర్‌‌ ఏరియాల నుంచి దళాలను వెనక్కి తీసుకోకుండా ఉద్రిక్తతలకు దారి తీస్తుంది..తాజాగా ఈ రోజు జరిగే చర్చలు రెండు దేశాలకు కీలకంగా మారనున్నాయి..సరిహద్దు నుంచి దళాలను వెనక్కి తీసుకోవాలి భారత్ డిమాండ్ చేస్తుంటే భారత్ వెనక్కి వేలితే తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉందని చైనా తెలిపింది..వచ్చే వారంలో అమెరికా మంత్రులు భారత్ వస్తుండటంతో రెండు దేశాల మధ్య చర్చలు చాలా హీట్ పెంచే అవకాలు ఉన్నాయి..సరిహద్దు వివాదంలో భారత్‌ అనుసరిస్తున్న వ్యూహాలకు మొదటి నుంచి అమెరికా సంపూర్ణ మద్ధతు ఇస్తుండటంతో చైనాపై మరింత ఒత్తిడి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news