దేశంలో ఆరు రోజుల తరవాత మళ్లీ భారీగా పెరిగిన కేసులు.. !

-

దేశంలో ఆరు రోజుల తర్వాత కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. గ‌త ఆరు రోజులుగా దేశంలో 30 నుండి 40 వేల మధ్య నమోదైన కేసులు మళ్లీ ఈరోజు 40వేలు దాటాయి. ఆరు రోజుల క్రితం బుధ‌వారం దేశంలో 41,602 కేసులు నమోదవగా కరోనాతో 488 మంది మృతి చెందారు. కాగా గడచిన 24 గంటల్లో దేశంలో 41,195 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే విధంగా మొత్తం 490 మంది కరోనా మ‌హ‌మ్మారితో మృతి చెందారు. ఇది ఇలా ఉండగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్ర‌స్తుతం నత్త నడకన సాగుతోంది.

corona virus
corona virus

వ్యాక్సిన్ సెంటర్లలో వ్యాక్సిన్ ల‌ కొరత ఏర్పడింది. ప‌ల్లెల్లో, ప‌ట్టణాల్లో ప్రజలు భారీగా వ్యాక్సిన్ లు వేసుకునేందుకు వ‌స్తున్నారు. అయితే ఇంత‌కాలం ప్ర‌జ‌లు వ్యాక్సిన్ లు వేసుకునేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. కానీ ప్ర‌స్తుతం వ్యాక్సిన్ లు వేసుకునేందుకు రావ‌డంతో వ్యాక్సిన్ ల కొర‌త క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఫ‌స్ట్ డోస్ వేసుకుని రెండో డోస్ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. దాంతో త్వ‌ర‌లో వ్యాక్సిన్ ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news