ఇండియా కరోనా అప్డేట్…భారీగా తగ్గిన కేసులు..!

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,596 కొత్త కేసులు నమోదుకాగా గడిచిన 230 రోజుల్లో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 97.79 కోట్ల వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి. దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 98.12%వద్ద ఉంది అంతే కాకుండా మార్చి 2020 తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం. గత 24 గంటల్లో 19,582 మంది కరోనా నుండి కోలుకోగా ఇప్పటివరకు మొత్తం 3,34,39,331 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ఇక యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే తక్కువ ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం 0.56%..మార్చి 2020 తర్వాత అత్యల్ప యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే వీక్లీ పాజిటివిటీ రేటు (1.37%) ఉండగా గత 115 రోజులకు 3% కంటే తక్కువ ఉంది. గత 49 రోజులకు 3% కంటే తక్కువ రోజువారీ పాజిటివిటీ రేటు (1.37%) గా నమోదు అయ్యింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 59.19 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించబడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news