ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక నిన్న తగ్గిన కరోనా మహమ్మారి కేసులు… ఇవాళ ఒక్క సారిగా ఎగిసిపడ్డాయి. తాజాగా ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఇండియా వ్యాప్తంగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో 7,495 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 78,291 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.46 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 434 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,78,759 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6,960 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,42,08,926 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,39,69,76,774 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236 కు చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/pdWUVwychG pic.twitter.com/WiiJ3GNexm
— Ministry of Health (@MoHFW_INDIA) December 23, 2021