ఇండియాలో కొత్తగా 8488 కరోనా కేసులు.. 538 రోజుల తర్వాత ఇదే మొదటిసారి

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఈరోజు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ నిన్నటి కంటే భారీగా తగ్గిపోయాయి కరోనా మహమ్మారి కేసులు. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో.. 8488 కరోనా కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. ఇంత తక్కువ కరోనా మహమ్మారి కేసులు నమోదు కావడం 538 రోజుల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఇదే సమయంలో గడచిన 24 గంటల్లో ఏకంగా 12510 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుంచి కోల్పోయిన వారి సంఖ్య.. 33934547 కు చేరుకుంది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 118443 యక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. సిద్ధ తక్కువ యాక్టివ్ కేసులు నమోదు కావడం 534 రోజుల తర్వాత ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 116 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే ఇప్పటి వరకు అరవై మూడు లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసింది కేంద్ర సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news