కెనడాతో బంధం తెంచుకున్న భారత్.. ట్రూడో విధానాలే కారణమా?

-

కెనడాతో బంధాన్ని భారత్ తెంచుకుంది. జస్టిస్ ఫర్ సిక్స్ అధినేత, ఖలీస్తాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తంతో పాటు దౌత్యవేత్తల ప్రమేయం కూడా ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించింది. అంతేకాకుండా భారత రాయబార అధికారులకు నోటీసులు ఇవ్వడంతో భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కెనడాలోని భారత దౌత్యవేత్తలు, అధికారులు, సిబ్బందిని వెనక్కి పిలిచింది.

అంతేకాకుండా ఢిల్లీలోని ఆరుగురు కెనడా రాయబారులను బహిష్కరిస్తూ సోమవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన క్లాష్ పెరిగింది. అందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో విధానపరమైన నిర్ణయాలే కారణంగా తెలుస్తోంది. ట్రూడో ప్రో ఖలీస్తానీలకు మద్దతుగా వ్యవహరిస్తూ ముందు నుంచి భారత్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇండియాలోని జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరును తెర పైకి తెచ్చింది. బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి భారత ఏజెంట్లు..కెనాడాలోని ప్రో ఖలీస్థానీలే లక్ష్యంగా తమదేశంలో పనిచేస్తున్నారని ఆరోపించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news