న్యూజిలాండ్: తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. 144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రను సమున్నత స్థాయిలో నిలిపేందుకు భారత్-న్యూజిలాండ్ జట్లు రెడీ అయ్యాయి. శుక్రవారం 3 గంటలకు ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కోహ్లీ ఆధ్వర్యంలో తొలి ఐసీసీ ట్రోఫీ కోసం భారత్ ఎదురుచూస్తోంది. రెండేళ్ల నుంచి ప్రత్యర్థులపై అద్భుత పోరాటంతో గెలుస్తూ డబ్ల్యూటీసీ ఫైనల్ దాకా చేరిన వేళ ఈ ఆఖరి సమరంలో అమీతుమీ తేల్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది.
ఇప్పటివరకూ ఆడిన టెస్టుల్లో భారత్‌దే పైచేయి. మొత్తం ఇరు జట్లు 59 మ్యాచులు ఆడాయి. అందులో భారత్ ఎక్కువ సార్లు విజేతగా నిలిచింది. భారత్ మొత్తం 21సార్లు గెలవగా.. న్యూజిలాండ్ 12 మ్యాచ్‌లో విజయం సాధించింది. మిగిలిన 26 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
భారత్ జట్టు ఇదే..
రోహిత్, గిల్, పుజార, కోహ్లీ (కెప్టెన్), రహానె, పంత్, జడేజా, అశ్విన్, ఇషాంత్, షమి, బుమ్రా.
న్యూజిలాండ్ జట్టు ఇదే..
కాన్వే, లాథమ్, విలియమ్సన్ (కెప్టెన్), టేలర్, నికోల్స్, వాట్లింగ్, గ్రాండ్‌హోమ్/అజాజ్, జేమిసన్, సౌథీ, వాగ్నర్, బౌల్ట్.