భారత్, పాక్ యుద్ధంపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ మీదకు అడుక్కుతినే పొజిషన్‌లో ఉన్న పాకిస్తాన్ యుద్దానికి కాలు దువ్వింది. భారత్ మీదకు నిన్న రాత్రి మిసైల్స్ తో దాడులకు పాల్పడింది.
తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్యూలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్పందిస్తూ.. భారత్, పాకిస్థాన్ యుద్ధం విషయంలో జోక్యం చేసుకోలేమని చేతులెత్తేశారు. ‘భారత్-పాక్ యుద్ధంలో మేము జోక్యం చేసుకోం..అది మాకు సంబంధించిన విషయం కాదు.ఆ రెండు దేశాలను మేము నియంత్రించలేం.. బాంబులు వేయొద్దని వాటికి ఆదేశాలు ఇవ్వలేం.కాకపోతే.. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలని మేము కోరుకుంటున్నాం’ అని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వెల్లడించారు.