పాక్ 50 డ్రోన్స్ కూల్చివేత.. భారత్‌కు చెందిన ఏ మిస్సైల్ కూల్చిందంటే?

-

పాక్ సైన్యం భారత్ మీద నిన్న రాత్రి నిర్దాక్షిణ్యంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి LOCతో పాటు భారత భూభాగంలోని ఉధంపూర్‌, సాంబా, జమ్ము, అఖ్నూర్‌, నగ్రోటా, పఠాన్‌కోట్ పాక్ ప్రయోగించిన మొత్తం 50 డ్రోన్లను భారత ఆర్మీ గాల్లోనే కూల్చేసింది.

L70 గన్స్‌, ZU-23 MM, అధునాతన ఆయుధాలతో వాటిని నాశనం చేసినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది.పాక్ డ్రోన్లను కూల్చడంలో సైన్యం ఆకాశ్ మిస్సైల్‌ను ఉపయోగించినట్లు తెలిపింది. పాక్ దాడిని పసిగట్టిన భద్రతా బలగాలు సరిహద్దుల్లో ఆకాశ్ మిస్సైల్స్‌ను సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించగా.. భారత్ సొంత టెక్నాలజీతో రూపొందించిన ఆకాశ్ భూమి మీద నుంచి నేరుగా మల్టిపుల్ లక్ష్యాలను మీడియం రేంజ్‌లో ఛేదించింది. రియల్ టైమ్ దాడులను వెంటనే గుర్తించి ప్రత్యర్థి ఎత్తులను ఆకాశ్ మిస్సైల్ సమర్ధవంతంగా తిప్పికొట్టిందని వెల్లడించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news