“ఇండియా” అనే పదాన్ని రాజ్యాంగం నుండి తొలగించాలి…

-

ప్రస్తుతం వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఎన్డీఏ మరియు ఇండియా కూటముల మధ్యన రసాభసగా చర్చలు జరుగుతున్నాయి. కాగా ఈ రోజు పార్లమెంట్ సమావేశాలలో భాగంగా ఉత్తరాఖండ్ కు చెందిన బీజేపీ ఎంపీ నరేష్ బన్సాల్ ఒక ఆసక్తికరమైన డిమాండ్ ను సభ ముందు ఉంచారు. ఈ డిమాండ్ ను విన్న మిగిలిన సభ్యులు అంత ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఉంటారు. ఇంతకీ ఈయన డిమాండ్ లో ఏముందో తెలుసా… ఇండియా అన్న పదం ఈయనకు నచ్చలేదని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇండియా అనేది వలస రాజ్యం మరియు మనల్ని రెండు వందల సంవత్సరాలు కాలం పాలించిన ఇంగ్లాండ్ మనకు పెట్టిన పేరట. ఈ పదాన్ని మనము పలుకుతున్నంత కాలం బానిసత్వంలో ఉన్నట్లే లెక్క అన్న అర్థంలో చెప్పారు. ఇక రాజ్యాంగంలోనూ దీని గురించి ఇండియా థట్ ఈజ్ భారత్ అని రాసినట్లు చెప్పారు.

ఎంతో కాలం నుండి మనదేశాన్ని భారత్ అనే పిలిచే వారు. ఇప్పుడు అదే పేరుతోనే మన దేశాన్ని పిలవాలని.. అందుకు తక్షణమే రాజ్యాంగం నుండి ఇండియా అనే పాడనీ తొలగించాలని ఉత్తరాఖండ్ ఎంపీ నరేష్ బన్సాల్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news