రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలోనే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీ నది ఉప్పొంగి.. ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్ నగరంలోని మూసారాంబాగ్, చాదర్ఘాట్ కాజ్వే వద్ద మూసీ నదిలో నీటిమట్టం వంతెనను తాకూడు ప్రవహిస్తోంది.
ఎగువన భారీ వర్షాలతో జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్‌కు పెద్దఎత్తున వరద వచ్చిచేరుతున్నది. ప్రస్తుతం 3 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో జలమండలి అధికారులు 4 గేట్లు ఎత్తి 2,750 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఇక ఉస్మాన్ సాగర్ నుంచి 852 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ముసారంబాగ్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. బ్రిడ్జిని ఆనుకుని నీరు వెళ్తున్నది.