ఆసియా కప్ టోర్నీ లో సూపర్ 4 లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే… ఈ మ్యాచ్ ఫిక్సింగ్ గురైందంటూ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఐపీఎల్ కాంట్రాక్టుల కోసం బిజినెస్ డీల్ మాట్లాడుకుంటూ ఫిక్సింగ్ కు పాల్పడ్డారంటూ ఆప్గాన్ ప్లేయర్లపై నేటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఘోరమైన ట్రోల్స్ తో #FixedMatch హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. నెటిజన్లు ఫిక్స్డ్ మ్యాచ్ అనడానికి మూడు కారణాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కోహ్లీ 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు క్యాచ్ అవుట్ కావాల్సింది. మహమ్మద్ నబీ బౌలింగ్ లో డీప్ మిడ్ వికెట్ మీదుగా కోహ్లీ హిట్ చేయగా, బౌండరీ వద్ద ఉన్న ఇబ్రహీం జాడ్రన్ క్యాచ్ అందుకునేందుకు వీలుంది.
అయితే అతను ఆ క్యాష్ వదిలేసిన విధానం చూస్తే ఎవరైనా సరే ఇది కావాలని వదిలేసి ఉంటాడని అనుకోక ఉండరు. లడ్డు లాంటి క్యాచ్ ను ఒంటి చేత్తో అందుకునే క్రమంలో వదిలేయడంతో అది సిక్స్ వెళ్ళిపోయింది. దీంతో నేటిజెన్లు ఈ వీడియోను ఎక్కువగా రోల్స్ చేస్తున్నారు. అలాగే రిషబ్ పంత్ ఇచ్చిన రెండు క్యాచ్లను ముజీబ్ ఊర్ రెహమాన్ వదలడమే కాకుండా, వాటిని బౌండరీలకు నెట్టేసినట్లు కనిపించింది. ముఖ్యంగా ఆప్గాన్ ప్లేయర్ల ముఖాల్లో ఎలాంటి కసి కనిపించలేదు. వేరాసి నేటిజెన్లను ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని ఫిక్స్ అయ్యారు. దీనితో ట్రోలింగ్ మొదలుపెట్టారు.
#MatchFixing #INDvAFG @ACBofficials @ICCMediaComms @ICC very poor fielding why?? pic.twitter.com/SXt86urGxN
— Yousaf Khan Lodhi (@yousafkhan1986) September 8, 2022
Match fixing. How he dropped kohli. https://t.co/aRs0JH4e04
— Aam Admi -عام آدمی🇵🇰 (@iamaamadmii) September 8, 2022