తెలంగాణ: ఎంఐఎం వచ్చే ఎన్నికల్లో 20 చోట్ల పోటీ ?

-

తెలంగాణాలో 2023 చివర్లో లేదా 2024 మొదట్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు సీట్లు సర్దుబాటు సరైన కాండిడేట్ ను ఎంపిక చేసుకోవడం వంటి విషయాల మీద కన్నేసింది. ఇక తెలంగాణాలో BRS కు మిత్రపక్షముగా ఉన్న ఎంఐఎం సైతం ఈసారి భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఎప్పటిలాగే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చీఫ్ అధికార పార్టీ BRS తో పొత్తును సాగిస్తూనే తన బలాన్ని పెంచుకునే విధంగా కసరత్తులు చేస్తోంది. అందుకోసం పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి చాలా ప్రయత్నాలను చేస్తోంది అని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 చోట్ల పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఓల్డ్ సిటీ లోని 7 నియోజకవర్గాలతో పాటు మహబూబ్ నగర్, గద్వాల్, రాజేంద్రనగర్, గోషామహల్, ముషీరాబాద్, అంబార్పేట్, నిజామాబాద్ అర్బన్ , బోధన్, ముధోల్, ఆదిలాబాద్, కొడంగల్, సంగారెడ్డి, వరంగల్ తూర్పు, అందోల్, తాండూరు, నిర్మల్ , బాన్సువాడ, కరీంనగర్ మరియు జహీరాబాద్ లో పోటీ చేస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news