వానా వానా వద్దమ్మా…!

-

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టి20 ఆక్లాండ్ వేదికగా జరగనుంది. 5 టి20 ల సీరీస్ లో భాగంగా జరుగుతున్న ఈ తొలి మ్యాచ్ లో ఎలా అయినా సరే విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. తొలి మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా తాము ఏంటో టీం ఇండియాకి తొలి మ్యాచ్ లోనే చెప్పాలని కివీస్ భావిస్తుంది. ఇక టీం ఇండియా విషయానికి వస్తే,

స్వదేశంలో తొలి మ్యాచ్ లో కివీస్ కి షాక్ ఇచ్చి పర్యటన మొత్తం హుషారుగా మొదలుపెట్టాలని కోహ్లీ సేన వ్యూహాలు రచిస్తుంది. ఇక ఈ మ్యాచ్ కి వర్షం అడ్డు పడే అవకాశాలు కనపడుతున్నాయి. భారత కాలమానం ప్రకారం 12;30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీనితో అభిమానులు వర్షం పడకుండా ఉంటే బాగుండూ అంటూ ప్రార్ధనలు కూడా చేస్తున్నారు. టి20 మ్యాచ్ కావడం,

భారత్ తో మ్యాచ్ అవడంతో ఆ దేశ అభిమానులు కూడా టికెట్లు భారీగా బుక్ చేసుకున్నారు. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, లేదా భారీ వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఇక ఇదిలా ఉంటే టీం ఇండియా ఈ మ్యాచ్ ద్వారా బ్యాటింగ్ ఆర్డర్ లో కీలక మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. రిషబ్ పంత్ ని తొలి మ్యాచ్ కి పక్కన పెడతారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news