విండీస్ VS టీమిండియా: విశాఖ వన్డేలో.. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ..

-

నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్‌-వెస్టిండీస్‌ రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో కోహ్లి సేన మొదట బ్యాటింగ్ చేస్తోంది. అయితే విండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా జోరుగా ఆడుతోంది. ఓపెనర్లు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. 46 బంతుల్లో 50 పరుగులు చేశాడు. వీటిలో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా అదే జోరు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 17 ఓవర్లకు 93 పరుగులు.

కాగా, ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలిచే స్థితిలో టీమిండియా ఉండగా… మరో దూకుడైన విజయంతో 2002 తర్వాత భారత గడ్డపై వన్డే సిరీస్‌ను అందుకోవాలని విండీస్‌ సేన పట్టుదలతో ఉంది. అంతకుముందు టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్టు కూర్పులో ఇరు జట్లు స్వల్ప మార్పులు చేశాయి. ఈ మ్యాచ్‌లో సునీల్ అంబ్రిస్ స్థానంలో ఎవిన్ లెవిస్, వాల్ష్ స్థానంలో కేరీ పెరారేకు ఛాన్స్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version