ఆస్ట్రేలియా గడ్డపై భారత్ మరో చారిత్రాత్మక విజయం సాధించింది. బ్రిస్బేన్‌లోని ది గబ్బా మైదానంలో జరిగిన చివరి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. ఓ దశలో వికెట్లు పడుతున్న భారత బ్యాట్స్ మెన్ నిలదొక్కుకుని గెలుపే లక్ష్యంగా చెలరేగారు. దీంతో ఆసీస్‌పై భారత్ విజయం సాధించింది.
మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని మొదటి ఇన్నింగ్స్‌లో 369, రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో టార్గెట్‌ను 97 ఓవర్లలో ఛేదించింది. 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ 2-1 తేడాతో సిరీస్ సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో భారత్ నమోదు చేసిన టెస్టు సిరీస్ విజయాల్లో ఇది ఇంకో చారిత్రాత్మక విజయం కానుంది.
కాగా ఆసీస్‌పై భారత్ టెస్టు సిరీస్ గెలవడంతో టీమిండియా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల తరువాత ఈ విజయం నమోదు కావడంతో వారు ఆనందంతో ప్లేయర్లను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. భారత్ గెలుపుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.