అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఇంకో ఇన్నింగ్స్ మిగిలి ఉండగానే విజయ బావుటాను ఎగురవేసింది. ఇంగ్లండ్‌పై భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై 160 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో డాన్ లారెన్స్ మినహా ఎవరు ఆకట్టుకోలేదు. 95 బంతుల్లో 6 ఫోర్లతో లారెన్స్ 50 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో అక్షర్ పటేల్‌కు 5, అశ్విన్‌కు 5 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో భారత్ 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. అలాగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కు అర్హత సాధించింది.