మోతెరా స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4 టెస్టుల సిరీస్ ను కొద్ది సేపటి క్రితం భారత్ సొంతం చేసుకుంది. ఈ చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 205 పరుగులు చేయగా భారత్ నుండి పంత్(101), సుందర్(96) ల దెబ్బతో 365 పరుగులు చేసి ఇంగ్లాండ్ పై 160 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
ఇక ఈరోజు తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత స్పిన్నర్ లు అశ్విన్, అక్షర్ దెబ్బకు 135 కే ఆల్ ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. దాంతో ఈ టెస్ట్ సిరీస్ ను 3-1 తో సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా జూన్ లో జరిగే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి కూడా అర్హత సాధించింది.