భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ నుంచి సాయం

-

భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ నుంచి మానవతా సహాయం అందింది. నిన్న రాత్రి భారత్ నుంచి విమానంలో అవసరమైన పరికరాలు, ఇతర సహాయ సామాగ్రిని కాబుల్ కు తరలించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరింగం బాగ్బి ట్వీట్ చేశారు. దీనిని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ రీట్వీట్ చేశారు. ఈ సహాయ సామాగ్రి తో పాటు ఒక సాంకేతిక బృందం కూడా కాబుల్ వెళ్ళింది.

భూకంపం లో దెబ్బతిన్న ఆఫ్గన్ కి తొలుత సాయం పంపిన దేశం భారత్ కావడం విశేషం. భారత్ నుంచి వెళ్లిన బృందంలో సభ్యులు తాలిబన్లతో కలిసి మానవతా సాయం పంపిణీని పర్యవేక్షించనున్నారు. ఈ బృందం అక్కడ ఉన్న భారత దౌత్య కార్యాలయం నుంచి పనిచేస్తోంది. తొలిసారి కాబూల్లోని భారత దౌత్య కార్యాలయంలో సిబ్బంది పనిచేస్తున్నట్లు అయింది. భారత దౌత్య బృందానికి తాలిబన్లు పలుమార్లు హామీలు ఇచ్చిన తర్వాతే ఈ టెక్నికల్ టీం ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్ళింది.

Read more RELATED
Recommended to you

Latest news